ఖైరతాబాద్, వెలుగు: యాదవ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో యాదవ టీచర్లకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిలభారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌యాదవ్ హాజరై 50 మందికి పురస్కారాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి విద్యావ్యవస్థలో ఎంబీఏ చదివి ఇంగ్లీషు పేపర్చదవలేని స్థితిలో ఉన్నారన్నారు.
అందుకే ఏ వృత్తిలో ఉన్నా అందులో నైపుణ్యం అవసరమన్నారు. యాదవ్స్ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. శరత్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేగల శ్రీనివాస్,కార్యదర్శి అరుణ్, సంఘం రాష్ట్ర కన్వీనర్ రవి చంద్ర, జితేంద్ర, మహేశ్ పాల్గొన్నారు.