వివేక్ వెంకటస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలి : వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వివేక్ వెంకటస్వామి కుమారుడు, కాంగ్రెస్ నేత వంశీకృష్ణ. మందమర్రి సింగర్ హైస్కూల్ గ్రౌండ్ లో వాకర్స్ ని కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో కలిసి టిఫీన్ సెంటర్లో దోశలు వేసిన వంశీకృష్ణ.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఓటర్లకు వివరించారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు వంశీకృష్ణ.