
సింగరేణి కార్మికుల ద్రోహి బీఆర్ఎస్.. దళితుల ద్రోహి పార్టీ బీజేపీ అని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. బీజేపీ కులమతాల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు. బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తోందన్నారు. సింగరేణి కార్మికులను గత పాలకులు నాశనం చేశారని విమర్శించారు. సింగరేణి కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.కార్మికుల కోసం కొప్పుల ఏం చేశారని ప్రశ్నించారు.
వంశీ గెలుపు ఖాయం: వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గడ్డం వంశీకృష్ణకు అన్ని సంఘాలు మద్దతు తెలిపాయన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు. కేంద్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలు డిసైడ్ అయ్యారని చెప్పారు. దేశంలో మోదీ ఇస్తామన్న రెండుకోట్ల ఉద్యగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు వివేక్ వెంకటస్వామి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పెట్రోల్,డీజిల్ ధరలను పెంచారని చెప్పారు. కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు ధరలు తక్కువగా ఉండేవన్నారు.