గడ్డం వంశీ పెద్దపల్లి నుంచి పోటీ చేయాలి

పెద్దపల్లి, వెలుగు:  రాబోయే పార్లమెంట్​ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని చెన్నూర్ ​ఎమ్మెల్యే డాక్టర్​ వివేక్​వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణను జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరారు. సోమవారం ఆయనను స్వగృహంలో కలిశారు. అనంతరం వంశీకృష్ణకు బొకే అందజేసి, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు  బాలసాని సతీశ్ గౌడ్,  ఓదెల శ్రీనివాస్, అనుమాల మహేశ్‌‌‌‌‌‌‌‌, పోతుల ప్రవీణ్, జక్కుల శ్రీకాంత్ పాల్గొన్నారు.

ఫెరాలిసిస్​ బాధితుడికి వంశీ చేయూత

ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన నాగపురి శ్రీనివాస్​ అనే పెరాలసిస్​ బాధితుడికి గడ్డం  వంశీ రూ. 5వేల ఆర్థికసాయం అందజేశారు. బాధితుడు శ్రీనివాస్​కు కొన్ని రోజుల కింద బ్రెయిన్​ ఆపరేషన్​జరిగింది. మందులు కూడా కొనలేని స్థితిలో ఉన్న బాధితుడికి మందుల ఖర్చుల కోసం గడ్డం వంశీ రూ. 5వేలు, ఓదెల మండల కాంగ్రెస్ నాయకుడు అల్లం సతీశ్‌‌‌‌‌‌‌‌​ద్వారా పంపించారు. సోమవారం బాధితుడి ఇంటికి వెళ్లి అందజేశారు.