సుల్తానాబాద్, వెలుగు: కాంగ్రెస్సీనియర్నేత, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి కుమారుడు, కాంగ్రెస్ పార్లమెంట్ నాయకుడు గడ్డం వంశీకృష్ణ.. పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావును సన్మానించారు. భోగి సందర్భంగా ఆదివారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానించగా.. ఆయన కూడా వంశీకృష్ణను సత్కరించారు. లీడర్లు సజ్జద్, బాలసాని సతీశ్‌గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్, రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
రంగనాథస్వామి ఆలయంలో పూజలు
జ్యోతినగర్, వెలుగు: రంగనాథ స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాథుల స్వామి తిరు కల్యాణ మహోత్సవంలో గడ్డం వంశీ కృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మల్లికార్జున్, బల్మూరి అమరేందర్ రావు, మహేందర్ రావు, దీపక్, మధు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బసంత్‌నగర్ వద్ద పాలకుర్తి మండల వివేక్యువసేన లీడర్లు వంశీని కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
వాలీబాల్ పోటీలు ప్రారంభం
ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు అవసరమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డం వంశీ అన్నారు. మాజీ జడ్పీటీసీ పొన్నం రామలింగం గౌడ్ స్మారకార్థం ఆదివారం పాలకుర్తి మండలం ఈస్సాల తక్కలపల్లి హైస్కూల్‌లో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఆ పోటీలకు ఎమ్మెల్యే, గడ్డం వంశీ హాజరై రామలింగం గౌడ్ ఫొటో వద్ద నివాళులర్పించారు.