గొల్లపల్లి, వెలుగు: గొల్లపల్లి మండలం భీంరాజ్‌పల్లిలో అభయాంజనేయస్వామి, ఇస్రాజ్ పల్లి గ్రామంలో త్రికుఠ ఆలయంలో గణపతి, శివలింగం, గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భీంరాజ్ పల్లిలో అన్నదానం నిర్వహించగా భక్తులతో కలిసి వంశీకృష్ణ భోజనం చేశారు. వారి వెంట మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, లీడర్లు చంద్రశేఖర్ రావు, సత్యనారాయణ గౌడ్, గంగాధర్, తిరుపతి రెడ్డి, లింగన్న, వెంకటేశ్ గౌడ్, రమేశ్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.
పెద్దాపూర్‌లో ఎమ్మెల్యే విజయరమణారావు..
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహా స్వామికి బుధవారం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ , ఎమ్మెల్యే విజయరమణారావు వేర్వేరుగా పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు.