ధర్మారం, వెలుగు : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జరుగుతున్న శివభక్త మార్కండేయ స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో గురువారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ శంకరయ్య ఆధ్వర్యంలో అతిథులను పూర్ణ కుంభంతో ఆహ్వానించారు. అనంతరం శివ పార్వతుల కల్యాణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మణ్ కుమార్ ను, వంశీకృష్ణ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, కాడే సూర్యనారాయణ, కొత్త నర్సింహులు, దేవి జనార్దన్, జగన్మోహన్ రెడ్డి, పాలకుర్తి రేణుక రాజేశం గౌడ్, రూప్ల నాయక్, మెడవేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
కోరుట్లలో గడ్డం వంశీ ...
కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు... గడ్డం వంశీ కృష్ణను కలిశారు. వంశీకి జువ్వాడి పూలమాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ , మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజం, ఉపాధ్యక్షులు నయీమ్, బ్లాక్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, నాయకులు మ్యాకల నర్సయ్య నేమూరి భూమయ్య పాల్గొన్నారు.
నూతన దంపతులకు గడ్డం వంశీ ఆశీస్సులు
పెద్దపల్లి : జిల్లా కేంద్రానికి చెందిన జోగినిపల్లి కమలాకర్ రావు కుమారుడి వివాహం స్థానిక ఫంక్షన్ హాలులో గురువారం జరిగింది. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరై నూతన దంపతులు ప్రీతం, సాయిప్రియను ఆశీర్వదించారు. ఆయనతోపాటు నాయకులు ఉనుకొండ శ్రీధర్పటేల్, భూమయ్య, శ్రీనివాస్, బండి రాజయ్య, మహేందర్ ఉన్నారు.