
హైదరాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం రాజ్యాంగ నిర్మాత, బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ట్యాంక్‌బండ్ మీద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత వంశీకృష్ణ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేశారని, విద్య ద్వారానే హక్కులను సాధించుకోవచ్చని చెప్పారని గుర్తుచేశారు. అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందించాలన్న ఉద్దేశంతో మా తాత కాకా వెంకటస్వామి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.