పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణను భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ పట్టణంలోని ఆదర్షనగర్ కాలనీలో ఆయన కార్నర్ మీటింగ్ నిర్వహించారు. చెన్నూర్ లో తనకు ఏదైతే మోజార్టీ ఇచ్చారో అంతకంటే ఎక్కువ మోజార్టీతో వంశీని గెలిపించాలన్నారు. కాక కుటుంబం మొత్తం ప్రజల సేవకు అంకితం అయిందని చెప్పుకొచ్చారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని.. జైపూర్ పవర్ ప్లాంట్, ఫర్టీలైజర్ సంస్థను తెరిపించానని గుర్తుచేశారు.
Also Read:మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ చేరిక నిలిపివేత
కాకా కుటుంబం నుండి వంశీకృష్ణను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో మంచి స్పందన వచ్చిందన్నారు వివేక్. చాలా మంది ఎమ్మార్పీఎస్, నేతకాని నాయకులు వచ్చి తమకు మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు. చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన తరువాత తాను కేవలం చెన్నూర్ కే అంకితం అయ్యాయని.. గత పాలకులు 5 సంవత్సరాలు తిరిగింది తాను కేవలం 3 నెలల్లో తిరగడం జరిగిందన్నారు. చెన్నూర్ నియోజకవర్గాన్ని ఒక మంచి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వివేక్ హామీ ఇచ్చారు.