యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడిన ఆయన.. ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లి ప్రజలకు సేవ చేస్తానన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తుపాకీ తూటాలకు ఎదురు నిలిచిన వ్యక్తి కాకా వెంకటస్వామి అన్నారు. నిరుపేదలకు పట్టాలు ఇచ్చి గుడిసెలు వేయించిన ఘనత కాకా వెంకటస్వామిదన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని చూసి కన్నుమూస్తానని కాక చెప్పారు..కానీ వచ్చిన తెలంగాణను కేసీఆర్ సర్వనాశనం చేశారని విమర్శించారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వ లేదన్నారు. వచ్చిన తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ఒక్క సారి అవకాశం ఇస్తే..పెద్దపల్లి ఎంపీగా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు వంశీకృష్ణ.