కోల్‌బెల్ట్, వెలుగు : చెన్నూరు మండలం ఒత్కులపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్కార్యకర్త కంకణాల దేవేందర్‌రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆయన కుటుంబాన్ని గురువారం కాంగ్రెస్యువనేత గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు.
ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి గెలుపు కోసం దేవేందర్‌రెడ్డి కష్టపడ్డాడని గుర్తుచేశారు. వంశీకృష్ణ వెంట కాంగ్రెస్ లీడర్హిమవంత్రెడ్డి తదితరులున్నారు.