యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యం : గడ్డం వంశీ

  •     పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ 
  •     లక్షెట్టిపేటలో ఇఫ్తార్ విందు

లక్సెట్టిపేట, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువత నిరుద్యోగులు మిగిలిపోయారని,  ఉన్నత చదువులు చదివి చివరకు ఆటోలు నడుపుకుంటూ  జీవనోపాధి  పొందాల్సిన పరిస్థితి వచ్చిందని  కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం లక్షెట్టిపేట లోని ఇఫ్తార్ విందుకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​ రావు తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ..  

పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం  కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాక వెంకటస్వామి స్ఫూర్తితో అందరి మేలు కోసం పాటుపడతానన్నారు.   కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ లీడర్లు చల్ల నాగభూషణం ఎండి ఆరిఫ్ చింత అశోక్ తదితరులు పాల్గొన్నారు.