వంశీని భారీ మెజార్టీతో గెలిపిస్తాం

  •     మద్దతు ప్రకటించిన ఎస్సీ 57 ఉప కులాల పోరాట సమితి

కోల్ బెల్ట్, వెలుగు : పెద్దపెల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కృషి చేస్తామని ఎస్సీ 57 ఉప కులాల  పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం తెలిపారు.  ఆదివారం మంచిర్యాలలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీని కుల సంఘాల లీడర్లు కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాకా వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు ఏళ్లుగా సేవలందిస్తుందన్నారు.

వంశీ గెలుపుతో ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పోరాట సమితి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు  సిరిపాటి వేణు, లింగయ్య, గోదారి కొమురయ్య, కోసంగి కుమార్, రవీందర్, మార్టిన్ తదితరులు పాల్గొన్నారు.

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

మంచిర్యాల, క్యాథనపల్లి, మందమర్రి, మందమర్రి రూరల్ లో జరిగిన పలువురి వివాహ వేడుకలకు ఎమ్మెల్యే వివేక్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ హాజరయ్యారు. వధూవరులు రవితేజ రెడ్డి–-మహాన్విత, స్నేహిత్ రెడ్డి-–ఉషారాణి, ప్రశాంత్ కుమార్-–దీపిక, వినయ్ గౌడ్–-హర్షిత, భగత్–పావని, రంజిత్ కుమార్-–కల్యాణి, రాజ్ కుమార్–హరిణిని ఆశీర్వదించారు.