![కాంగ్రెస్ మూడో జాబితా..పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ](https://static.v6velugu.com/uploads/2024/03/gaddam-vamsikrishna-as-peddapalli-congress-candidate_htHvQdX0b2.jpg)
కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేశారు. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమబెంగాల్ నుంచి 57 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదు మంది అభ్యర్థులను ప్రకటించారు.
పెద్దపల్లి ఎంపీ టికెట్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీకృష్ణకు కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కేటాయించారు. తెలంగాణలో ఇంకా ఖమ్మం, భువనగిరి,నిజామాబాద్,హైదరాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి.
అయితే ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన కు కాంగ్రెస్ అధిష్టానం సికింద్రాబాద్ ఎంపీ సీటును కేటాయించింది.
తెలంగాణ నుంచి ఐదుగురు
- మల్కాజ్ గిరి : సునీతా మహేందర్ రెడ్డి
- సికింద్రాబాద్: దానం నాగేందర్
- పెద్దపల్లి: గడ్డం వంశీకృష్ణ
- చేవెళ్ల : రంజిత్ రెడ్డి
- నాగర్ కర్నూలు: మల్లు రవి
తొలిజాబితాలో నలుగురు వీళ్లే
- మహబూబ్ నగర్ - వంశీ చందర్ రెడ్డి
- జహీరాబాద్- సురేశ్ షెట్కార్
- మహబూబాబాద్- బలరామ్ నాయక్
- నల్గొండ - రఘువీర్ రెడ్డి