పెద్దపల్లి జిల్లాలో గడ్డం వంశీకృష్ణ గెలుపుతో సంబురాలు

పెద్దపల్లి జిల్లాలో గడ్డం వంశీకృష్ణ గెలుపుతో సంబురాలు

పెద్దపల్లి/మంథని/ధర్మారం/  వెలుగు: గడ్డం వంశీకృష్ణ ఎంపీగా గెలువడంతో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం కౌంటింగ్​ స్టార్ట్​ అయినప్పటి నుంచి వంశీ లీడ్​ కొనసాగుతుండడంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. 

గెలుపు ప్రకటన రాగానే జిల్లా వ్యాప్తంగా మంథని,  పెద్దపల్లి, రామగిరి, ధర్మారం, గొల్లపల్లి, కమాన్పూర్​, గోదావరిఖని ఇతర ప్రాంతాల్లో పటాకులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో  సయ్యద్​ సజ్జాద్​, బాలసాని సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కొండి సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బండారి సునీల్​, గంగుల సంతోష్​ తో పాటు గడ్డం వంశీ అభిమానులు పాల్గొన్నారు.