రెండు ఎంపీ సీట్లతో తెలంగాణ కోసం కొట్లాడినం అని చెప్పుకునే బీఆర్ఎస్ .. అధికారంలోకి వచ్చాక 09 మంది ఎంపీలను ఇస్తే అభివృద్ధి మాత్రం ఏమీ చేయలేదని విమర్శించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ప్రజలను మోసం చేశారని.. బంగారు తెలంగాణ అని చెప్పి నిరుద్యోగుల తెలంగాణగా మార్చారన్నారు.
ఉద్యోగాలు అమ్ముకుని అమాయకులను నిండా ముంచారన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నెన్నల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టింది కాంగ్రెసేనని చెప్పారు గడ్డం వంశీకృష్ణ. ఉపాధి హామీ ప్రారంభమైన 20 ఏళ్లలో కూలీ రెట్లు పెంచలేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తె కూలీ రేట్లు రూ. 400 లకు పెంచుతుందన్నారు.