పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. 12 వ రౌండ్ పూర్తయ్యేసరికి 84 వేల164 ఓట్లతో ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్ ను తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, బీఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ లకంటే ముందంజలో ఉన్నారు. గడ్డం వంశీకృష్ణ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మహబూబాబాద్, జహీరాబాద్, భువన గిరి, ఖమ్మం, వరంగల్, నాగర్ కర్నూల్, నల్లగొండ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. దీంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నిక కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఏ ఒక్క సెగ్మెంట్ లో కూడా ప్రభావం చూపిం చలేకపోయింది.
మరోవైపు బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, కరీంనగర్,నిజామాబాద్, ఆదిలాబాద్, మహ బూబ్ నగర్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
=========================