పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతు పలుకుతున్నట్లు దివ్యాంగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నారా నాగేశ్వరరావు తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశంలో ఫ్రెండ్లీ ఎన్విరాన్ మెంట్ ఫర్ ది డిసెబుల్డ్ ప్రధాన కార్యదర్శి చెరుకు నాగభూషణం, అఖిల భారత దివ్యాంగుల ఐక్య వేదిక అధ్యక్షుడు పల్లెబోయిన సుధాకర్ వర్మ లతో కలిసి ఆయన మాట్లాడారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని దివ్యాంగులు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపుకు కృషి చేయాలని కోరారు.