తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి : గడ్డం వంశీకృష్ణ

కోల్​లెల్ట్, వెలుగు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని వనదేవతలను కోరుకున్నట్లు చెన్నూర్ ఎమ్మెల్యే తనయుడు, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రామకృష్ణపూర్​లో సమ్మక్క, సారక్క జాతరను ఆయన సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. చెన్నూర్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ తన తండ్రి వివేక్ వెంకటస్వామిని భారీ మెజారిటీతో గెలిపించారని, వారి రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తామన్నారు.

తెలంగాణ ప్రజలు పడిన కష్టాలు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.  అయన వెంట మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,  ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య,  కాంగ్రెస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీపీఐ లీడర్లు ఉన్నారు.