ఛత్రపతి శివాజీ స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలె : గడ్డం వంశీకృష్ణ

  •     పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
  •     దండెపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాం ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు ప్రేమ్​సాగర్​ రావు, వివేక్, వంశీకృష్ణ

కోల్​బెల్ట్/దండెపల్లి/లక్సెట్టిపేట, వెలుగు: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తిగా యువత మంచి మార్గంలో నడిచి సమాజాభివృద్ధికి కృషి చేయాలని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు, వివేక్​వెంకటస్వామి, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ  సోమవారం ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ పాలన సత్యం, ధర్మమే లక్ష్యంగా సాగిందన్నారు. 

కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

మందమర్రి మండలం అందుగులపేటకు చెందిన మాజీ సర్పంచులు ఏనుగు తిరుపతిరెడ్డి, ఎనగందుల మల్లయ్య, మాజీ ఎంపీటీసీ దుర్గం శ్రీనివాస్ తదితరులు ఎమ్మెల్యే వివేక్​ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి, లక్సెటిపేట, హాజీపూర్​ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ప్రేమ్​సాగర్​రావు, వివేక్​తోపాటు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో దండేపల్లి మండలానికి చెందిన చింతపల్లి, కాసిపేట సర్పంచులు లింగంపల్లి  బాపు, మైదం యశోద గాంగరెడ్డి,  మేదరిపేట ఆర్య వైశ్య సంఘం నాయకులు కాంగ్రెస్ లో చేరారు. 

లక్సెట్టిపేట మండలానికి చెందిన మాజీ ఎంపీపీలు కొత్త వెంకటేశ్వర్లు, కట్ల చంద్రయ్య, మాజీ వైస్​ఎంపీపీలు మోత్కురు వెంకటస్వామిగౌడ్, పెండం రాజు, మాజీ సర్పంచులు నడిమెట్ల రాజన్న, బాకం లచ్చన్న, గొల్ల కాంతయ్య, మాజీ ఎంపీటీసీలు, మున్సిపల్​ కౌన్సిలర్​సాయిని సుధాకర్​తో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​ గూటికి చేరారు. వీరికి ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 

మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ దొంతుల ముఖేశ్, నక్షత్ర ఇంజనీరింగ్ అథినేత చాకినారపు అనిల్ కాంగ్రెస్​లో చేరారు. సోమవారం రాత్రి ప్రేమ్ సాగర్ రావు, వివేక్​వెంకటస్వామి, డీసీసీ ప్రెసిడెంట్​కొక్కిరాల సురేఖ, గడ్డం వంశీ కృష్ణ సమక్షంలో హాజీపూర్​ మండలం గుడిపేట, హాజీపూర్, బుద్దిపల్లి, టీకానపల్లి​మాజీ సర్పంచులు దొమ్మటి లచ్చన్న, పూదరి శంకరయ్య, అన్నం మధూసూదన్​రెడ్డి, రాంటెంకి మల్లేశ్వరి, కొట్టె మహేందర్, వార్డు మెంబర్లు, కులసంఘాల బాధ్యులు, బీఆర్ఎస్ వివిధ విభాగాల బాధ్యులు తదితరులు చేరారు.

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్, వంశీకృష్ణ

మందమర్రి మండల పరిధిలో జరిగిన పలు వివాహ వేడుకలకు వివేక్​ వెంకటస్వామి, వంశీకృష్ణ హాజరయ్యారు. సాయికిరణ్​రెడ్డి-–అనూహ్య రెడ్డి, శ్రావణ్​కుమార్–-అఖిల, వికాస్–-అనూష వధూవరులను ఆశీర్వదించారు.