
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ లో అభయాంజనేయ స్వామిఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేలా ఆశీస్సులు ఉండాలని దేవుడిని కోరుకున్నారు. ఆనంతరం ఆలయ అర్చకులు వంశీకృష్ణకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచారు వంశీకృష్ణ. ఇక బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ బరిలో ఉన్నారు. మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.