జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలోని శ్రీ గుండు ఆంజనేయస్వామిని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ దర్శించుకున్నారు. అంజన్నకు ముడుపు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అంజన్న స్వాములకు భిక్ష పెట్టి వారితో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఎంపీఅభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిచేలా చూడాలని కోరుకున్నానన్నారు వంశీ కృష్ణ. వంశీని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్.