బెల్లంపల్లి, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆదివారం ఉదయం బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ-2 గ్రౌండ్లో స్థానిక వాకర్స్, కాంగ్రెస్ లీడర్లతో కలిసి వాకింగ్చేశారు.
ఈ సందర్భంగా కొద్దిసేపు క్రికెట్ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. గ్రౌండ్లో సమస్యలను పరిష్కారిస్తానని, ఎంపీగా తనను ఆదరించి గెలిపించాలని వాకర్స్, స్థానికులను అభ్యర్థించారు.