
కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలను జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ పోటీలను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీ కృష్ణ ప్రారంభించారు. క్రీడాకారులకు టీ షర్ట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వంశీకృష్ణ.. క్రికెట్ తో తమ ఫ్యామిలీకి చాలా దగ్గర అనుభందం ఉందన్నారు. తన తండ్రి వివేక్ వెంకటస్వామి కూడా హెచ్సీఏ ప్రెసిడెంట్ గా పనిచేశారని గుర్తు చేశారు. తాను కూడా స్కూల్ డేస్ లో క్రికెట్ ఆడానని చెప్పారు. క్రీడల నుంచే గెలుపు ఓటముల గురించి యువతకు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలని సూచించారు. వంశీకృష్ణ కాసేపు బ్యాటింగ్ చేసి అక్కడి వారిని ఉత్సాహ పరిచారు. టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. ఇరు జట్లను విష్ చేశారు.