కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆశీస్సులతోనే పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ విజయం సాధించారని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కొండగట్టు అంజన్నకు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండగట్టు ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గుడికి కావలసిన అవసరాలను అర్చకుల ద్వారా తెలుసుకున్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు వంశీ , ఆదిరెడ్డి, పాల్గొన్నారు.
దత్తాత్రేయ ఆలయంలో పూజలు
బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం పాత వరదవెల్లి గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆదివారం సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.