జైపూర్(భీమారం), వెలుగు : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు భీమారం మండల కేంద్రంలో గడ్డం వెంకటస్వామి (కాక)– కళావతి స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను స్థానిక ఎంపీటీసీ చేకుర్తి సరోజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిభ గల యువకులను ప్రోత్సహించేందుకు టోర్నీ నిర్వహిస్తున్నామని, క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.
ఈ పోటీలు 15 రోజుల పాటు జరుగనున్నట్లు చెప్పారు. ఫైనల్ లో గెలిచిన జట్టుకు రూ.15 వేలు, రన్నరప్ టీమ్‌కు రూ.10వేలతోపాటు ట్రోఫీలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు చేకుర్తి సత్యనారయణ రెడ్డి, తైనేని రవి, సుధాకర్, అలకాటి తిరుపతి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.