మనసున్న మహారాజు కాకా

మనసున్న మహారాజు కాకా

తెలంగాణ తొలితరం ఉద్యమ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి మనసున్న మహారాజు అని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం కాకా వర్ధంతి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో కాకా ఫొటోలు, ఫ్లెక్సీలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

సింగరేణితో కాకా అనుబంధం మరువలేనిదని, పెద్దపల్లి పార్లమెంట్ ను​అభివృద్ధి చేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, మెదక్ లోని సిద్దిపేట నుంచి లోక్ సభ సభ్యునిగా ఏడుసార్లు ఎన్నికై రికార్డు సృష్టించారని గుర్తుకు చేసుకుని.. కాకా సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా పలుచోట్ల దుప్పట్ల పంపిణీ చేశారు. చెన్నూరుతోపాటు పలుప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమం చేపట్టగా, ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు. శ్రీరాంపూర్ జీఎం ఆఫీసు వద్ద జరిగిన వేడుకల్లో జీఎం సూర్యనారాయణ పాల్గొని కాకా ఫొటోకు నివాళులు అర్పించారు.  - వెలుగు, నెట్​వర్క్​