కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ లూటీ చేసిండు : గడ్డం వినోద్

  •  అక్రమార్కుడు దుర్గం చిన్నయ్యను చిత్తుగా ఓడించాలి
  •      బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సీఎం కేసీఆర్​అక్రమాలకు పాల్పడి రూ.లక్ష కోట్లను లూటీ చేశాడని బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ రాష్ట్ర మంత్రి గడ్డం వినోద్ ఆరోపించారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తాను, తన సోదరుడు వివేక్ వెంకటస్వామి ఈ ఎన్నికల్లో డబ్బు సంచులతో ఈ ప్రాంతానికి వచ్చామని కేసీఆర్ పేర్కొనడం సిగ్గుచేటన్నారు. 

ప్రజాధనాన్ని లూటీ చేసిన సీఎం కేసీఆర్ దివాలాకోరు మాటలు మాట్లాడడం దారుణమన్నారు. డబ్బులు సంపాదించుకునేందుకు తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పదేండ్లపాటు బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోని అక్రమార్కుడు, అవినీతిపరుడు, భూకబ్జాదారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ఓడించేందుకు వచ్చానన్నారు. 

ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ ఇన్ చార్జి రేగుంట చంద్రశేఖర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్, కాంగ్రెస్, సీపీఐ పార్టీల నాయకులు ఎండీ నిజాముద్దీన్, బొంకూరి రామచందర్, బొంతల లక్ష్మీనారాయణ, జుమ్మిడి బానయ్య తదితరులు పాల్గొన్నారు.