
బెల్లంపల్లి,వెలుగు: కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కోసం మాజీ మంత్రి గడ్డం వినోద్ శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను బెల్లంపల్లి నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. వినోద్ వెంట కార్కూరి రామ్ చందర్, మత్తమారి సూరిబాబు, ముచ్చర్ల మల్లయ్య, సింగతి సత్యనారాయణ, రత్నం ప్రదీప్, రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, గట్టు మల్లేశ్, వి. పంతులు, రాజమౌళి, సాంబయ్య తదితరులు
పాల్గొన్నారు.