బెల్లంపల్లి ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలి: గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మాజీ మంత్రి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ కోరారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ  39వ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోద్​ మాట్లాడుతూ.. దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలను కొనియాడారు.  

బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ అందుబాటులో ఉంటానని, ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పార్టీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, లీడర్లు పోచంపల్లి హరీశ్, అంకం రవి, మేకల శ్రీనివాస్, జమ్మికుంట విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.