భూ కబ్జాలు చేసే చిన్నయ్యను ఓడించాలి: గడ్డం వినోద్​

బెల్లంపల్లి రూరల్, వెలుగు: భూ కబ్జాలకు పాల్పడే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ఓడించాలని బెల్లంపల్లి కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం వినోద్​ఓటర్లను కోరారు. కాసిపేట మండలంలోని బీఆర్ఎస్​, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి ఆదివారం భారీగా చేరికలు జరిగాయి. మాజీ మంత్రి గడ్డం వినోద్​ఆధ్వర్యంలో లంబాడి తండా, సోమగూడం(కె), సండ్రల్​పాడ్, మామిడిగూడ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్​నాయకులు పార్టీలోకి చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వినోద్​మాట్లాడుతూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య భూకబ్జాలు తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్​హయాంలో మంజూరైన భవనాలను బీఆర్ఎస్​మంజూరు చేసినట్లు చెప్పుకోవడం దారుణమన్నారు. తాను ఇక్కడే ఉండి నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని ప్రమాణం చేశారు. నాయకులు నస్పూర్​నర్సింగ్, వెంకటేశ్వర్​రావు, మాజీ సర్పంచ్​చందూలాల్​, కుర్మ నర్సయ్య, సిద్ధం బాపు, తిరుపతి, రత్నం ప్రదీప్ తదితరులు ఉన్నారు.