బెల్లంపల్లి రూరల్, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్చెప్పారు. మంగళవారం తాండూర్ మండలం బోయపల్లి, చౌటపల్లి, కాసిపేట, కిష్టంపేట గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దుర్గం చిన్నయ్య హయాంలో బీఆర్ఎస్ లీడర్లు వందలాది ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు.
ప్రజలకు సుపరిపాలన అందిస్తానని, చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ ఈసా,
మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్గట్టు మురళీధర్‌రావు, ఎంపీటీసీ శంకర్, నాయకులు నేతరి స్వామి, సాంబయ్య, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భారీ మెజారిటీతో వినోద్ గెలుపు ఖాయం
బెల్లంపల్లి: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓటమి ఖాయమని, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు, బెల్లంపల్లి టౌన్ ఎన్నికల ఇన్చార్జి కేవీ ప్రతాప్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని 22వ వార్డు బూడిదిగడ్డ బస్తీలో కాంగ్రెస్ నేత మునిమంద రమేశ్, మాజీ కౌన్సిలర్ గొమాస ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రతాప్ పాల్గొన్నారు.
గడగడపకూ వెళ్లి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు. బీఆర్ఎస్ అవలంభించిన ప్రజా వ్యతిరేకత విధానాల వల్ల రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డం వినోద్‌ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అభ్యర్థించారు.