దుర్గం చిన్నయ్య దుర్మార్గాలు ప్రజలు భరించలేకపోతున్నారు: గడ్డం వినోద్

దుర్గం చిన్నయ్య దుర్మార్గాలు ప్రజలు భరించలేకపోతున్నారు: గడ్డం వినోద్

బెల్లంపల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్య దుర్మార్గాలు ప్రజలు భరించలేకపోతున్నారని గడ్డం వినోద్ తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు దుర్గం చిన్నయ్య మాకు వద్దని అంటున్నారని తెలిపారు. ఖబడ్దార్ దుర్గం చిన్నయ్య... నీ అవినీతి అక్రమాల చిట్టా బయటకు లాగుతానన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నయ్య అక్రమాలపై విచారణ చేయిస్తానని చెప్పారు. తాను వచ్చింది ప్రజా సేవ కోసమే తప్ప సంపాదించుకోవడం కోసం కాదని తెలియజేశారు. నిస్వార్ధంగా బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని గడ్డం వినోద్ చెప్పారు. 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ సమక్షంలో 500 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా వారికి గడ్డం వినోద్ పార్టీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.