గెలుస్తామని రిపోర్ట్ ఉండటంతోనే హైకమాండ్ టికెట్లు ఇచ్చింది: ఎమ్మెల్యే వినోద్

గెలుస్తామని రిపోర్ట్ ఉండటంతోనే హైకమాండ్ టికెట్లు ఇచ్చింది: ఎమ్మెల్యే వినోద్
  • హైకమాండ్ టికెట్లు ఇచ్చింది: ఎమ్మెల్యే వినోద్ 

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో గెలుస్తామ ని హైకమాండ్​కు రిపోర్ట్ ఉండటంతోనే చాన్స్ ఇచ్చిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ అన్నారు. ప్రజలు కూడా తమను ఆశీర్వదించారని తెలిపారు. తమ కుటుంబంలో ముగ్గురికి అవకాశం ఇచ్చారని అనడం సరికాదన్నారు. 

మంగళవారం సీఎల్పీ సమావేశం  అనంతరం గడ్డం వినోద్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి మా తండ్రి కాకా వెంకటస్వామి ఎంతో సేవ చేశారు. అందుకే మా ఫ్యామిలీకి అవకాశాలు వచ్చాయి. ప్రేమ్​సాగర్ రావు మా కుటుంబంపై ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడారు. ఇది సరికాదు’’అని గడ్డం వినోద్ అన్నారు.