![రేవంత్ రెడ్డిని కలిసిన గడ్డం వినోద్ కుమార్](https://static.v6velugu.com/uploads/2023/08/Gaddam-Vinod-Kumar-who-met_vjZiWHouRb.jpg)
బెల్లంపల్లి, వెలుగు : టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆదివారం మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం వినోద్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని రేవంత్ ఇంటికి వెళ్లిన వినోద్ ఆయనతో పలు అంశాలపై చర్చించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వంటి విషయాలు మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రేవంత్ సూచించారు.