గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తా : గడ్డం వినోద్​

గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తా : గడ్డం వినోద్​

బెల్లంపల్లిరూరల్, వెలుగు:  ‘మా నాన్న మీద ఓట్టేసి చెబుతున్నా ప్రజలకు అందుబాటులో ఉండి బెల్లంపల్లి నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తా’ అని   బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్​అన్నారు. శుక్రవారం వేమనపల్లి మండల కేంద్రంతో పాటు కళ్లంపల్లి, ముక్కిడిగూడం, జాజులపేట, సుంపుటం, గొర్లపల్లి, దస్నాపూర్, నీల్వాయి, ముల్కలపేట గ్రామపంచాయతీల్లో బైక్​ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.  

ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. పోడు భూముల పట్టాలు ఇవ్వలేదని, వేమనపల్లి, ‌‌-బుయ్యారం పదేళ్లుగా రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య సింగరేణి, ఇతర వందలాది ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. తాను అవినీతిపరుడిని కాదని, తాను కబ్జాలు చేసి అక్రమంగా సంపాదించలేదని, కష్టపడి వ్యాపారంతో సంపాదించానని తెలిపారు.   

చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సాబీర్​ఆలీ, ఎంపీటీసీ  సంతోష్​కుమార్​, సర్పంచులు పద్మ, గాలి మధు, నాయకులు శంకర్​గౌడ్​, ముజ్జు, తోకల రాంచందర్​ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదల అభివృద్ధి

బెల్లంపల్లి, వెలుగు:  ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదల అభివృద్ధి జరుగుతదని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం  పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లేబర్ అడ్డా వద్ద తాపీ కార్మికులను కలిసి  వారి సమస్యలను వినోద్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వ్యతిరేకి కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అప్పులకుప్ప అవుతుందన్నారు.  బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నియోజకవర్గ అభివృద్ధిని ఎన్నడూ పట్టించుకోలేదన్నారు.  

చిన్నయ్య, ఆయన అనుచరులు భూకబ్జాలు చేస్తూ ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ వస్తే సింగరేణి, సంఘటిత, అసంఘటిత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.  తనను గెలిపిస్తే తాపీ కార్మికుల కోసం పట్టణంలో లేబర్ అడ్డా ఏర్పాటుకు ప్రత్యేక స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.  ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అభ్యర్థించారు.   కార్యక్రమంలో  పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మోహన్ జోషి, టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, బండి ప్రభాకర్ యాదవ్, చిలుముల శంకర్,  సళ్లా సంజీవరెడ్డి, గోమాస ప్రశాంత్, మోగురం కన్నయ్య, ఎళ్తూరి శంకర్,  లీడర్లు నాతరిస్వామి, జమ్మికుంట విజయకుమార్, ఎలుక ఆకాశ్,  రామగిరి శ్రీనివాస్, మేకల శ్రీనివాస్, లెంకల శ్రీనివాస్, ఎండీ నిజాముద్దీన్, గొడుగు రఘు తదితరులు పాల్గొన్నారు.