కాటారం, వెలుగు : మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుధవారం కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో గొడుగులు పంపిణీ చేశారు.
వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగా గొడుగులు పంపించారని, అలాగే గతంలో బెంచీలు అందించారని బీజేపీ నాయకులు వెల్లడించారు.
పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని, కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం తిరుపతి, చింతకాని ఎంపీటీసీ ఉడుముల విజయ, బీజేపీ నాయకులు గంట అంకయ్య, వెంకట్రెడ్డి,మంత్రి సునీల్,శ్రీశైలం,రాజులు పాల్గొన్నారు.