పాల్వంచ, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన గడ్డం వివేక్ వెంకటస్వామిని మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కర్ మంగళవారం ఘనంగా సన్మానించారు.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ లో అకౌంట్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న విజయ భాస్కర్ హైదరాబాద్ లోని వివేక్ వెంకటస్వామి నివాసానికి వెళ్లి ఆయనను శాలువా, తులసి, పూల గజమాలతో సత్కరించారు. నాయకులు ప్రవీణ్, రామ్ కుమార్ పాల్గొన్నారు.