తనను ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్ కు సేవకుడిగా పనిచేస్తానన్నారు గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాలలో కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన..కేసీఆర్ గత పదేళ్లుగా నిరుద్యోగుల బలిదాలపై పరిపాలన చేశారని అన్నారు. కేసీఆర్ సర్కార్ పదేళ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ ను పట్టించుకోలేదన్నారు. గత సర్కార్ ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు.
పెన్షన్ స్కీం తీసుకొచ్చిందే కాంగ్రెస్సేనని అన్నారు గడ్డం వంశీకృష్ణ. కార్మికుల కోసంకాకా ఎంతో చేశారని చెప్పారు. తనను చిన్నకొడుకుగా ఆశీర్వదించాలని కోరారు. పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే.. నిరుద్యోగులకు ప్రభుత్వ సంస్థలు తీసుకొస్తానని చెప్పారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటానన్నారు. సింగరేణి కార్మికులకు అండగా ఉండేది కాంగ్రెస్సేనని తెలిపారు. సంక్షేమం దిశగా కాంగ్రెస్ ముందుకెళ్తుందన్నారు. బీఆర్ఎస్.. బీజేపీకి ఓటు అడిగే హక్కులేదన్నారు. గత సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. అభివృద్ది కావాలంటే కాంగ్రెస్ తో కలిసి రావాలని పిలుపునిచ్చారు.