గద్దర్ అవార్డులకు సీఎం గ్రీన్ సిగ్నల్

గద్దర్ అవార్డులకు సీఎం గ్రీన్ సిగ్నల్
  • ఎఫ్ డీసీ నుంచి త్వరలో నోటిఫికేషన్: దిల్ రాజు

హైదరాబాద్, వెలుగు:  గద్దర్ సినిమా అవార్డులకు సంబంధించిన విధివిధానాలను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి, ఆమోదం తెలిపారు. త్వరలోనే అవార్డులకు చెందిన పూర్తి వివరాలను  ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

అయితే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఉగాది రోజున ప్రదానం చేసేందుకు నిర్ణయించినప్పటికీ.. పురస్కారాల కోసం వచ్చిన చిత్రాలను ఎంపిక చేయడానికి కొంత సమయం పడుతుందని సీఎంకు దిల్ రాజ్ తెలియజేసినట్టు సమాచారం. దీంతో ఉగాదికి కాకుండా ఇంకాస్త ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.