హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని గద్దర్ కుటుంబ సభ్యులు కలిశారు. ఆదివారం తాజ్ కృష్ణా హోటల్‌కు వెళ్లిన గద్దర్ భార్య విమల, కొడుకు సూర్యం, బిడ్డ వెన్నెలను.. సోనియా, రాహుల్, ప్రియాంక ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఓదార్చారు.
Also Rard: తొలి పూజకు వేళాయే.. అన్ని ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ
అనంతరం పార్టీ నేత మధుయాష్కీ గౌడ్, సూర్యం మీడియాతో మాట్లాడారు. నిజానికి గద్దర్ ఇంటికి సోనియా, రాహుల్ వెళ్లాల్సి ఉందని.. అనివార్య కారణాల వల్ల అది రద్దయిందని మధుయాష్కీ తెలిపారు. ‘‘మా నాన్నతో ఉన్న అనుబంధాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. మమ్మల్ని ధైర్యంగా ఉండాలని సోనియా, రాహుల్ చెప్పారు” అని సూర్యం తెలిపారు.