గద్దర్ తెలంగాణలో పుట్టడం అందరి అదృష్టమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయన్న భట్టి.... ఆయన ఆలోచనలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాకవి గద్దర్ జయంతి.. వర్దంతి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఒక పాట తో, ఒక మాట తో లక్షల మందిని నడిపించిన గద్దర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
ALSO READ | ఇంకోసారి గద్దర్ గురించి తప్పుగా మాట్లాడితే.. నాంపల్లికి ఆయనే పేరే పెడతాం: సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా చరిత్రలో గద్దర్ ఫిలిం అవార్డు లు ప్రకిటిస్తామన్నారు. ఆ బాధ్యత కూడా నాకే అప్పగించారన్న .. రాబోయే ఉగాది కి గద్దర్ ఫిల్మ్ అవార్డులు ఇస్తామన్నారు. గద్దర్ తో సహా అందే శ్రీ ,గోరేటి వెంకన్న ,పేర్లను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు వీరు గొప్ప వ్యక్తులు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడారన్నారు. గద్దర్ అన్న ఆలోచనలు బావి తరాలకు అందించటానికి కాంగ్రెస్ నేతలందరం అందరం కలసి పని చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.