పోటీ చేయలేకపోయా..నన్ను క్షమించండి: గద్దర్​

సూర్యాపేట, వెలుగు: రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో మునుగోడులో పోటీ చేయాలని భావించానని, కానీ పోటీ చేయలేకపోయినందుకు ప్రజలు తనను క్షమించాలని ప్రజాగాయకుడు గద్దర్ వేడుకున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన  మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయలేకపోవడంపై స్పందించారు.

తనపై వచ్చే నిందలకు తన మౌనమే సమాధానమని గద్దర్ అన్నారు. మునుగోడులో రాజ్యాంగాన్ని రక్షించి, ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించడంలో నవతరం ముందుండాలని విజ్ఞప్తి చేశారు.