ప్రజా గాయకులు, ప్రముఖ విప్లవ కవి గద్దర్(Gaddar) ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరిన ఆయన.. అక్కడ చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన తల్లిదండ్రులు ఎవరు? కుటుంబ నేపథ్యం ఏంటీ..? అన్నది తెలుసుకుందాం..
లచ్చమ్మ, శేషయ్యల ముద్దుబిడ్డ
లచ్చమ్మ, శేషయ్యల బుద్ధుబిడ్డే.. గద్దర్(Gaddar). ఆయన 1949లో మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో జన్మించారు. హైస్కూల్ విద్యాభ్యాసాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసిన గద్దర్(Gaddar).. ఇంజినీరింగ్ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. ఆయన మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
బ్యాంకు ఉద్యోగం రాగానే పెళ్లి
గద్దర్(Gaddar) 1975లో కెనరా బ్యాంకులో క్లర్క్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ ఉద్యోగం రాగానే ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య పేరు విమల(Vimala). ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు(సూర్యూడు, చంద్రుడు), ఒక కుమార్తె(వెన్నెల). వీరిలో చంద్రుడు 2003లో అనారోగ్యంతో కన్నుమూశారు.