పాట ఉన్నంత వరకు గద్దర్ ఉంటరు : ఏపూరి సోమన్న

కోదాడ, వెలుగు :  ఈ భూమిపై పాట ఉన్నంత వరకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఉంటారని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. ఆదివారం కోదాడ బాయ్స్‌ హైస్కూల్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన  ‘గద్దరన్న యాదిలో’ కార్యక్రమంలో గద్దర్‌‌ కొడుకు సూర్యం, కళాకారులు నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి,  వేమూరి పుష్ప, రాంబాబు, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో కలిసి పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ..  తెలంగాణ ఉద్యమంలో తన పాటతో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిన గద్దర్ మరిచి పోలేని జ్ఞాపకమన్నారు. ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కందుల మధు మాట్లాడుతూ..  తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.