హనుమకొండలోని కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి: గద్దర్​గళం ఫౌండేషన్

హనుమకొండలోని కళాక్షేత్రానికి  గద్దర్ పేరు పెట్టాలి: గద్దర్​గళం ఫౌండేషన్

ఖైరతాబాద్, వెలుగు: హనుమకొండలో నిర్మించిన కళాక్షేత్రానికి ప్రజా యుద్ద నౌక గద్దర్ పేరు పెట్టాలని గద్దర్ గళం ఫౌండేషన్ అధ్యక్షుడు కొల్లూరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్​పసునూరి రవీందర్, సీనియర్​ జర్నలిస్ట్​పాశం యాదగిరి, సామాజిక వేత్త సమ్మిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 ప్రజాభవన్​కు జ్యోతిరావు​ ఫూలే, కోఠిలోని విమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేర్లు పెట్టడాన్ని స్వాగతించారు. తెలంగాణ  సాధనకు నిరంతరం కృషి చేసిన గద్దర్​కు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలన్నారు. 

కాళోజీ పేరు హెల్త్​ యూనివర్సిటీకి ఉన్నందున కళాక్షేత్రానికి గద్దర్​ పేరును పెట్టి తెలంగాణ అమరులైన గూడ అంజయ్య, చుక్క సత్తయ్య, బెల్లి లలిత, వరంగల్​శంకర్​, సారంగపాణి వంటి  కవులు, కళాకారుల విగ్రహాలను ఆవరణలో పెట్టాలని కోరారు.