ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు విజయం

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా  గాదె శ్రీనివాసులు విజయం

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు ఘన విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీనివాసులు గెలుపొందారు. శ్రీనివాసులు విజయంపై ఎన్నికల సంఘం మరి కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనుంది. కాగా, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో గాదె శ్రీనివాసులకు బీజేపీ మద్దతు ఇవ్వగా.. ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు టీడీపీ, జనసేన సపోర్టు ఇచ్చాయి. ఈ క్రమంలో బీజేపీ మద్దతు ఇచ్చిన గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. ఓటమిని అంగీకరించిన రఘువర్మ.. శ్రీనివాసులకు ఆల్ ది బెస్ట్ చెప్పి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

టీచర్ల తీర్పును శిరసా వహిస్తా ఆయన స్పష్టం చేశారు. కాగా, ఏపీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో మాత్రం కూటమి పార్టీలు వేర్వేరు అభ్యర్థులకు తమ మద్దతు తెలిపాయి. గాదె శ్రీనివాసులుకు బీజేపీ సపోర్ట్ ఇవ్వగా.. రఘువర్మకు టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయి. చివరకు బీజేపీ మద్దతు ఇభ్యర్థి విచ్చిన అజయం సాధించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.