టూల్స్ గాడ్జెట్స్ : మల్టీ కుక్కర్

టూల్స్ గాడ్జెట్స్ : మల్టీ కుక్కర్

గుడ్లు, కూరగాయలు ఉడికించాలి, పాలు కాగపెట్టాలి, వెజిటబుల్​, మోమోస్​ను ఆవిరికి ఉడికించాలి. సూప్స్​, నూడిల్స్​, ఉప్మా లేదా అన్నం వండేయాలి. ఈ పనులన్నీ చేసేలా ఒక కుక్కర్​ ఉంటే భలే ఉంటుంది కదా! అలాంటిదే ఈ ఎలక్ట్రిక్​ మల్టీపర్పస్​ కుక్కర్. దీన్ని బ్రేడెన్​ కూకో ఎలోర్​​ మార్కెట్​లోకి తెచ్చింది. దీన్ని మల్టీ కుక్కర్​గానే కాకుండా స్మార్ట్​ కెటిల్​లా కూడా వాడుకోవచ్చు. ఇందులో ఉండే స్టీమ్ ర్యాక్​ కుక్కర్​లా ఉపయోగపడుతుంది. 

దీనిలోని కెటిల్​ను 304 స్టెయిన్​లెస్​ స్టీల్​ ఫుడ్​ గ్రేడ్​ మెటీరియల్​తో తయారుచేశారు. దానివల్ల స్ట్రాంగ్​గా ఉంటుంది. ఎక్కువ రోజులు మన్నుతుంది. ఇందులో​ వండడం సేఫ్​. 1.8 లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ కుక్కర్​కు గ్లాస్​​ లిడ్​ ఉంది. హ్యాండిల్స్​ పట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. వాటిని పట్టుకుంటే వేడి తగలదు. ఆన్​, ఆఫ్​ బటన్​లతో పాటు100 నుంచి 600 వాట్స్​ వరకు టెంపరేచర్​ని అడ్జస్ట్​ చేసుకోవచ్చు. క్లీన్​ చేయడం కూడా చాలా ఈజీ. తక్కువ బరువు ఉండే ఈ కుక్కర్​ ట్రావెలింగ్​కి చాలా బాగా పనికొస్తుంది. పోర్టబుల్​గా ఉండటం వల్ల ఎటువెళ్తున్నా క్యారీ చేయడం ఈజీ.  ధర: 1,849 రూపాయలు

బేబీ క్యారియర్​

కాటన్​ బ్రీతబుల్ నెట్​ బేబీ క్యారియర్ ఇది​. ఏ సీజన్​లో అయినా వాడొచ్చు. 90 శాతం కాటన్​, పది శాతం స్పాండెక్స్​ మెటీరియల్​తో తయారుచేసిన దీన్ని లిన్​రెక్స్​ కంపెనీ మార్కెట్​లోకి తెచ్చింది. ఇందులో బేబీని పెట్టి భుజాలకు వేసుకున్న వాళ్లకు, అందులో ఉన్న బేబీకి ఎవరికీ ఇబ్బంది లేకుండా సాఫ్ట్​గా ఉంటుంది. ఎలాస్టిక్​ ఉంటుంది కాబట్టి ఫ్లెక్సిబుల్​గా ఉంటుంది. నాన్​ అలర్జిక్​. ఇందులో ఉన్న బేబీ హిప్​ను క్యారీ చేసే ఫీచర్​ను 0.2 అంగుళాల మందమైన కాటన్​ ప్యాడింగ్​తో తయారుచేశారు. 

5.1 వెడల్పాటి ప్యాడెడ్​ షౌల్డర్​ వల్ల భుజాలకు ఇబ్బంది ఉండదు. బేబీని ఇందులో ఎక్కువసేపు పెట్టి ఎత్తుకున్నా అటు బేబీకి, ఇటు ఎత్తుకున్న వాళ్లకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని125–155 సెంటీమీటర్లు లేదా 49–61 అంగుళాల మేర అడ్జస్ట్​ చేసుకోవచ్చు. ఇది20.4 కేజీల వరకు బరువు ఆపుతుంది. దీన్ని వాడడం చాలా ఈజీ. ఇది ఎక్స్​ట్రా లగేజ్​లా ఉండదు. ఎందుకంటే దీన్ని చక్కగా మడతపెట్టి హ్యాండ్​బ్యాగ్​లో పెట్టుకోవచ్చు. మెషిన్​లో వాష్​ చేసేయొచ్చు. పనులు చేసుకునేటప్పుడే కాకుండా ఇందులో బేబీని ఉండి పాలు కూడా పట్టొచ్చు. 0–36 నెలల బిడ్డ వరకు ఇది పనికొస్తుంది.
ధర: 699 రూపాయలు

బైక్ల​ బ్రేక్​ లాక్ 

స్కూటర్లు, బైక్స్​ రోడ్డు మీద పెడితే దొంగలు ఎత్తుకుపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే బైక్​ బ్రేక్​ లాకింగ్​ సిస్టమ్​ బెటర్​. బ్రేక్​ లీవర్​తో ఉన్న బైక్​ లాకింగ్ సిస్టమ్​ను తయారుచేసింది హెట్​క్రిషి . హెవీ డ్యూటీ బ్రేక్​ లాకింగ్​ సిస్టమ్​ వల్ల బండికి సేఫ్టీ అన్నట్టు. ప్లాస్టిక్​ మెటీరియల్​తో తయారుచేసిన ఇది అన్ని రకాల స్కూటర్లకు, మోటార్​ సైకిల్స్​కు ఉపయోగం. ఈ సేఫ్టీ లాక్​ గ్రిప్​ సైజ్​ 27–38 మిల్లీమీటర్లు. ఫ్రంట్​ బ్రేక్​ లీవర్​కి దీన్ని వేస్తే బైక్​ను ముందుకు నెట్టలేరు, సైడ్​ స్టాండ్​ వేయలేరు. అదే రేర్​ బ్రేక్​ లీవర్​కు వేస్తే వెనక టైర్​ తిరగదు. వదులు కాదు. అలాగే క్లచ్​ నట్​ను టైట్​ లేదా లూజ్​ చేయడం కూడా కుదరదు. ఈ సేఫ్టీ బైక్​ బ్రేక్​లాక్స్​ కొన్ని రంగుల్లో దొరుకుతాయి. 
ధర: 779 రూపాయలు

స్లీపింగ్​ ఇయర్​ప్లగ్స్​

సిలికాజెల్​తో తయారుచేసిన ట్రావెల్​ ఇయర్​ప్లగ్స్ ఇవి. సింపుల్​గా చెప్పాలంటే బయటి రణగొణధ్వనులు వినపడకుండా చేసే నాయిస్​ క్యాన్సిలింగ్​ ఇయర్​ ప్లగ్స్​ అన్నమాట. డొరాకిట్టెన్​ స్లీపింగ్​ ఇయర్​ప్లగ్స్​ను మరోలా కూడా వాడొచ్చు. పిల్లలకు స్నానం చేసేటప్పుడు చెవుల్లోకి నీళ్లు పోకుండా వీటిని పెట్టొచ్చు. అలాగే స్విమ్మింగ్​ చేసేటప్పుడు  చెవుల్లోకి నీళ్లు పోకుండా వీటిని పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్​ లేదా ఫ్యామిలీలో ఎవరికైనా గిఫ్ట్​ ఇవ్వాలనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్. సిలికాజెల్​ మెటీరియల్తో  తయారుచేసిన వీటి సైజ్​ 3 X 2.5 సెంటీమీటర్లు. చీమచిటుక్కుమన్నా నిద్రలేచే వాళ్లు ఈ ఇయర్​ ప్లగ్స్​ పెట్టుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. మరీ ముఖ్యంగా ట్రావెలింగ్​లో​, చదువుకునేటప్పుడు​ బాగా పనికొచ్చే అవకాశం ఉంది. 

ధర: 220 రూపాయలు