పాక్ బార్డర్ లో.. దేశంలోనే ఎత్తయిన జెండా 

అమృత్ సర్ సమీపంలోని అట్టారి–వాఘా బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన దేశంలోనే అతిఎత్తయిన జాతీయ జెండాను గురువారం కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కలిసి ప్రారంభించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జెండా 418 అడుగుల ఎత్తు ఉంది. అయితే, బార్డర్ లో అటువైపు ఏర్పాటు చేసుకున్న పాకిస్తాన్ జాతీయ జెండా కంటే మన త్రివర్ణ పతాకం18 ఫీట్లు ఎక్కువ ఎత్తు ఉండటం విశేషం