గద్వాల, వెలుగు: స్టూడెంట్స్ కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం ఎర్రవల్లి మండలం బీచుపల్లి టీజీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీలో స్టూడెంట్లతో మాట్లాడారు. మంగళవారం రాత్రి అక్కడే బస చేసి ఉదయం స్టూడెంట్లతో కలిసి ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కష్టపడి చదివి రోల్ మోడల్ గా ఎదగాలన్నారు. పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ పై దృష్టి పెట్టి చదువులో ముందుకు సాగాలని సూచించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఉన్నారు.
వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలి
వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలని కలెక్టర్ ఆఫీసర్లకు సూచించారు. బుధవారం ఇటిక్యాల మండలం కొండేరు గ్రామంలో ఐకేపీ కొనుగోలు సెంటర్‌ను అడిషనల్ కలెక్టర్ నర్సింగ్‌రావుతో కలిసి పరిశీలించారు. సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండేరు గ్రామంలో మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు. డీపీవో శ్యాంసుందర్ పాల్గొన్నారు.